భారతదేశం, ఏప్రిల్ 4 -- జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు.

సంగీత్ శోభన్ సోలో హీరోగా తెరకెక్కిన రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది. రాకాస సినిమాకు విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ దక్కింది. ఈ క్రమంలో సినిమా విడుదలైన శుక్రవారం (ఏప్రిల్ 3) నాడు చిత్ర యూనిట్ రాకాస బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "'రాకాస' మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్క...