భారతదేశం, మార్చి 24 -- మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా రాకాస. హారర్ కామెడీ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు. రాకాసలో సంగీత్ శోభన్‌కు జోడీగా హీరోయిన్ నయన్ సారిక నటించింది.

పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాతలగా నిర్మించిన రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రాకాస సినీ ఇంట్రెస్టింగ్ విశేషాలను డైరెక్టర్ మానస శర్మ పంచుకున్నారు.

మానస శర్మ : మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో 'మ్యాడ్ హౌస్' చేశాను. ఆ తరువాత ఓటీటీ వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. ఆ తరువాత మరో 'బెంచ్ లైఫ్' అనే ఓటీటీ సిరీస్‌ని చే...