భారతదేశం, సెప్టెంబర్ 21 -- Raaka Guinness Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' (Raaka) సినిమా రిలీజ్‌కు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్‌గా ఈ మూవీ టీమ్ హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రయోగంతో ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌ను మేకర్స్ రివీల్ చేశారు. కొద్దిరోజుల క్రితం '37' నంబర్‌తో ఒక సస్పెన్స్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీ పెంచారు. ఇప్పుడు ఆ 37 సీక్రెట్ ఏంటో అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు.

ఒకేసారి 37 మంది నటీనటులను రియల్ టైమ్‌లో 'మోషన్ క్యాప్చర్' (Motion Capture) టెక్నాలజీతో...