భారతదేశం, జూలై 20 -- Raaka: 'పుష్ప 2' తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా'. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ కి సంబంధించి టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

రీసెంట్‌గా 'సీతా పయనం' సినిమాలో మెరిసిన సిరి హనుమంతు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తున్న రాకా సినిమాలో నటించే బంపర్ ఆఫర్ దక్కింది. ఇటీవల జరిగిన చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు.

సిరి క్యారెక్టర్ గురించిన వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంట...