భారతదేశం, ఆగస్టు 19 -- సమాజంలో కులం, మతం, భాష పేరుతో విభేదాలు పెరుగుతున్న తరుణంలో మాజీ ప్రపంచ సుందరి, సినీ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. మనుషులను వేరుచేసే సరిహద్దులను చెరిపేసి, మానవత్వాన్ని చాటిచెప్పేలా ఆమె పంచుకున్న సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గత ఏడాది పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో ఐశ్వర్యా రాయ్ ప్రసంగించారు. సత్య సాయిబాబా బోధించిన ప్రేమ, సేవా గుణాలను స్మరించుకుంటూ మానవ సంబంధాల ప్రాముఖ్యతను వివరించారు. "మానవత్వమే ఏకైక కులం; ప్రేమే ఏకైక మతం; హృదయ భాషే ఏకైక భాష; దేవుడొక్కడే, ఆయన సర్వాంతర్యామి" అని ఐశ్వర్యా రాయ్ పేర్కొన్నారు.

మనుషులను వేరుచేసే సంకెళ్లను తెంచుకుని, సమాజంలో ప్రతి ఒక్కరినీ అనుసంధానించే మానవత్వాన్ని గుర్తించాలని ఈ వ్య...