భారతదేశం, మే 20 -- ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రను పీలేకు ముందు, పీలే తర్వాత అని విభజించవచ్చు. మైదానంలో బంతి ఆయన కాళ్ల వద్ద ఉందంటే.. అది గోల్ పోస్ట్‌లోకి వెళ్లాల్సిందే. మూడు ప్రపంచ కప్‌లు, వెయ్యికి పైగా గోల్స్.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సామాన్యుడికి సైతం స్ఫూర్తినిచ్చే ఆయన జీవన తత్వం మరో ఎత్తు. పీలే కేవలం క్రీడాకారుడు మాత్రమే కాదు, ఓటమి అంచుల్లో ఉన్నవారికి ఆశనిచ్చే ఒక మార్గదర్శి.

నేటి తరం ప్రతిదీ వేగంగా ఆశిస్తోంది. రాత్రికి రాత్రే గుర్తింపు, క్షణాల్లో విజయం కావాలనుకునే ఈ కాలంలో, పీలే చెప్పిన ఒక మాట ఇప్పటికీ ఆచరణీయమైనది:

"గెలుపు ఎంత కష్టంగా దక్కితే.. ఆ విజయం ఇచ్చే తృప్తి అంత గొప్పగా ఉంటుంది."

- పీలే

సులభంగా దొరికే దేనికైనా విలువ తక్కువగానే ఉంటుంది. అడ్డంకులను ఎదుర్కొని, చెమట చిందించి, విమర్శలను దాటుకుంటూ సాధించిన విజయమే మనల్ని చరిత్రలో నిలబెడు...