భారతదేశం, మే 7 -- Priyanka Chopra Survival Thriller Reset Movie: హాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌ను టచ్ చేస్తున్నారు. ఎమ్మీ అవార్డు గ్రహీత మ్యాట్ స్మక్లర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రీసెట్ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

నాగరిక ప్రపంచానికి దూరంగా, అడవి మధ్యలో స్పృహలోకి వచ్చిన ఒక మహిళకు.. తను అక్కడికి ఎలా వెళ్లిందో గుర్తుండదు. ఆ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలతో బయటపడాలంటే, అక్కడ కలిసిన ఒక అపరిచితుడిని ఆమె నమ్మాల్సి ఉంటుంది. కానీ, ఆ వ్యక్తి నిజంగా సహాయం చేసేవాడా లేక మరేదైనా కుట్ర ఉందా? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ రీసెట్ సినిమా సాగనుంది.

'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి భారీ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓర్లాండో బ్లూమ్ ఈ రీసె...