భారతదేశం, మార్చి 16 -- హాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు 'ఆస్కార్ 2026' వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భారతీయ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి ప్రజెంటర్‌గా మెరిసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన ప్రియాంక చోప్రా తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ప్రియాంక చోప్రా ఫ్యాషన్ ఎంపికపై మాత్రం సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్కార్ 2026 వేడుక కోసం ప్రియాంక చోప్రా ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ 'డియోర్' (Dior) రూపొందించిన స్ట్రాప్‌లెస్ వైట్ గౌనును ధరించారు. హాలీవుడ్ గోల్డెన్ ఎరా నాటి క్లాసిక్ లుక్‌ను గుర్తుకు తెచ్చేలా ఈ డ్రెస్ ఉంది. హై-స్లిట్, ఫెదర్ డీటెయిలింగ్‌తో ఉన్న ఈ గౌనుకు తోడుగా ప్రియాంక...