Principal Murder : ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపింది విద్యార్థులే.. వెలుగులోకి సంచలన నిజాలు
భారతదేశం, ఆగస్టు 19 -- జ్ఞానాన్ని అందించి, భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువునే విద్యార్థులు.. తమ చేతులతో కడతేర్చిన దారుణ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగింది. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి (45) హత్య కేసులో పోలీసులు వెలికితీసిన నిజాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ప్రాథమిక వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో నివాసముంటున్న రూపారెడ్డి భర్త ఆగస్టు 11వ తేదీ రాత్రి పనిమీద హైదరాబాద్లో ఉన్నారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థులే ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. పదునైన కత్తితో ఏకంగా 27 సార్లు పొడిచి ఆమెను అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. అనంతరం ఇంట్లో ఉన్న దాదాపు రూ.4 లక్షల నగదును దోచుకెళ్లారు.
ఈ హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దాదాపు 80 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.