భారతదేశం, మార్చి 7 -- బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టు యజమాని ప్రీతీ జింటా ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి వార్తల్లో నిలిచారు. బాంద్రాలోని అత్యంత సంపన్న ప్రాంతమైన పాలి హిల్‌లో తనకున్న విలాసవంతమైన (లగ్జరీ) అపార్ట్‌మెంట్‌ను ప్రీతి జింటా రూ. 18.50 కోట్లకు విక్రయించినట్లు ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది.

ప్రీతీ జింటా గత నాలుగు నెలల కాలంలో అపార్ట్‌మెంట్‌ను విక్రయించడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లో ఇదే 'రుస్తోమ్‌జీ పరిశ్రమ్' భవనంలోని 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ప్రీతి జింటా రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించారు.

తాజాగా మార్చి 2, 2026న రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ల ప్రకారం.. అదే భవనం, అదే అంతస్తులో ఉన్న మరో 1,770 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను తాజాగా ప్రీతి జింటా అమ్మేశారు.

భ...