భారతదేశం, ఫిబ్రవరి 17 -- రెండు దశాబ్ధాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

ఈ కేసును విచారించిన హైకోర్టు అప్పట్లోనే జైలు శిక్షను ఖరారు చేసింది. కానీ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు న్యాయస్థానం. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని స్పష్టం చేసింది.

ముందుగా ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ మేరకు 2...