భారతదేశం, మార్చి 21 -- ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్: ది రివెంజ్' ప్రభంజనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

ధురంధర్ 2 సినిమాను పొగిడిన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండలను ఉద్దేశించి ప్రకాష్ చేసిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ధురంధర్ 2 సినిమాను ఇప్పటివరకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేశ్ బాబులు మెచ్చుకున్నారు. మరి బాలీవుడ్ స్టార్లు ఎవరైనా ట్వీట్ చేశారా?" అని ప్రశ్నించారు.

దీనికి ప్రకాష్ రాజ్ బదులిస్తూ.. "కృతజ్ఞత తీర్చుకోవాల్సిన అవసరాలు (Signs of Obligations) ఇప్పుడు దక్...