భారతదేశం, ఆగస్టు 6 -- Pradeep Rawat Son Vikramaditya Emotional: 'సై', 'గజినీ' వంటి ఎన్నో చిత్రాల్లో విలన్‌గా మెప్పించిన సీనియర్ నటుడు ప్రదీప్ రామ్ సింగ్ రావత్ (74) (Pradeep Ram Singh Rawat) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఆగస్టు 4న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ముంబైలో నిర్వహించారు.

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అశుతోష్ గోవారీకర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన కుమారుడు విక్రమాదిత్య రావత్ భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు మున్నీరయ్యారు.

అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఆయన తండ్రి చివరి క్షణాలను గుర్తుచేసుకున్నారు. ప్రదీప్ రావత్ అనారోగ్యానికి గురైన మొదట్లో తామంతా సాధారణ కడుపు ఇన్ఫెక్షన్ అని భావించినట్లు విక్రమాదిత్య తెలిపారు. రెండు నెలల క్రితం వరకు ...