భారతదేశం, అక్టోబర్ 26 -- Prabhas Fauzi Controversy Netaji Grandnephew: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన 'ఫైల్ నంబర్ 25' గ్లింప్స్ తీవ్ర దుమారం రేపుతోంది.

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను ఫౌజీ చిత్రంలో అవమానపరిచేలా, ఆయన ప్రతిష్టను దిగజార్చేలా చూపించారంటూ నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ బహిరంగంగా మండిపడ్డారు. దేశ ప్రజలకు, స్వాతంత్ర్య పోరాటాన్ని గౌరవించే వారందరికీ దర్శకుడు హను రాఘవపూడి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

సినిమా నిర్మించే క్రమంలో దర్శకులకు, నిపుణులకు సృజనాత్మక స్వేచ్ఛ (Creative Freedom) ఉంటుందనే విషయాన్...