భారతదేశం, మే 25 -- Prabhas Motivates Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు జగపతి బాబు రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని వేగంతో దూసుకుపోతున్నారు. ఇటీవల సలార్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించిన జగపతి బాబు త్వరలో రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జగ్గుభాయ్.. రెబల్ స్టార్ ప్రభాస్ గుణగణాల గురించి, ఆయనకున్న సహృదయత గురించి ఎమోషనల్ విషయాలను బయటపెట్టారు. తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన సమయంలో ప్రభాస్ తనకు ఎలా అండగా నిలిచారో గుర్తుచేసుకున్నారు జగపతి బాబు.

టాలీవుడ్‌లో ప్రభాస్ లార్జర్ దాన్ లైఫ్ పాత్రలు పోషిస్తూ అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవితంలో ఎంతో సాధారణంగా ఉంటారని పరిశ్రమలో టాక్ ఉంది....