భారతదేశం, మే 11 -- Pooja Batra About Deepika Padukone Kriti Sanon Height: గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు ఆకర్షణీయమైన రూపం ఉండాలి. కానీ, ఒక్కోసారి ఆ రూపమే అవకాశాలకు అడ్డుగా మారుతుందని అంటోంది మాజీ మిస్ ఇండియా, నటి పూజా బాత్రా.

90వ దశకంలో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ కష్టాలను గుర్తు చేసుకున్నారు. కేవలం తన ఎత్తు (Height) వల్లే తాను ఎన్నో మంచి ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని పూజా బాత్రా సంచలన విషయాలను వెల్లడించారు.

ఒకప్పుడు బాలీవుడ్ హీరోల కంటే హీరోయిన్లు పొడవుగా ఉంటే ఒప్పుకునేవారు కాదు. పూజా బత్రా ఇదే సమస్యను ఎదుర్కొన్నారట. "నేను నా సహనటుల కంటే పొడవుగా ఉండటంతో, కెమెరా ఫ్రేమ్‌లో వారికంటే పొట్టిగా కనిపించడానికి షూటింగ్ సమయంలో కాళ్లు పక్కకు చాపి (స్ల...