భారతదేశం, నవంబర్ 1 -- Pony Verma About Marriage With Prakash Raj: టాలీవుడ్‌లో విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్. వెండితెరపై ఆయన కనిపించే తీరు, చెప్పే సంభాషణలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై విలన్‌గా మెప్పించినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏడిపించినా ఆయన శైలే వేరు.

అటువంటి నటుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఆయన సతీమణి, ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రకాష్ రాజ్‌తో తన ప్రేమ, పెళ్లి ప్రయాణం వెనుక ఉన్న జ్ఞాపకాలను ఆమె మనసు విప్పి మాట్లాడారు.

ప్రకాష్ రాజ్‌ను తెరపై మొదటిసారి చూసిన క్షణాన్ని పోనీ వర్మ గుర్తు చేసుకున్నారు. "2003లో వచ్చిన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలో ప్రకాశ్‌ను వీల్‌చైర్‌లో కూర్చున్న ఒక వృద్ధుడిగా మ...