భారతదేశం, అక్టోబర్ 23 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా నిరంతరాయంగా ముందుకు సాగేలా రూ. 600 కోట్ల అదనపు నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

సింగిల్ నోడల్ ఏజెన్సీ - రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయం (SNA-SASCI) నిధుల కింద ఈ అమౌంట్‌ను విడుదల చేశారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ (PIPLMC), కుడి ప్రధాన కాలువ (PIPRMC) పనులకు సంబంధించి బకాయి ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ఈ సొమ్మును వినియోగిస్తారు. "సమయం ప్రకారం నిర్దేశించుకున్న ప్రణాళికల మేరకు కాలువల పనులు నిరంతరాయంగా పూర్తి కావడమే లక్ష్యంగా ఈ రూ. 600 కోట్ల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను పోలవరం ప్రాజెక...