భారతదేశం, సెప్టెంబర్ 4 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చక్రిని ఇంట్లో పనులు చేయమంటుంది మహాలక్ష్మి. చక్రి చేయకుంటే హాస్టల్‌కి వెళ్లిపోతానని బెదిరిస్తుంది. దాంతో అన్ని పనులు చేస్తానని చక్రి చేస్తాడు. అంట్లు తోముతాడు. ఎంత తోమిన ప్లేట్స్ తీసుకొచ్చి ఇస్తూనే ఉంటుంది మహాలక్ష్మి.

ఇంకా పక్కింటివాళ్లవి కూడా ఉన్నాయా అని చక్రి అంటాడు. ఒక్కో దానికి ఒక్కే ప్లేట్ వాడినప్పుడు లేదా. పెద్ది ఎంత కష్టపడుతున్నాడో ఇప్పటికైనా అర్థమైందా అంటుంది మహాలక్ష్మి. ఫాస్ట్‌గా తోమితే సౌండ్ వస్తుందని, మెల్లిగా తోమితే ఎప్పుడు పూర్తవుతాయని చక్రికి వంకలు పెడుతుంది మహాలక్ష్మి.

పెద్ది కష్టపడి వండిపెడితే బాగా తిని కూర్చుంటున్నారని అంటుంది మహా. అదంతా చూసిన కేశవ, కన్నా నవ్వుకుంటారు. గోపికకు లైన్ వేసినందుకు అసూయతో చక్రిని ముప్పుతిప్పలు పెడుతుం...