భారతదేశం, సెప్టెంబర్ 18 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బన్సి ఇంటి దగ్గర మాధవ ఉంటాడు. జయంతితో ఎంగేజ్‌మెంట్ గురించి, కేశవ పెళ్లి గురించి, వాడు నావల్ల వాయిదా వేసుకుంటాడు అని మాధవ మాట్లాడుతాడు. మీరంతా ఒకరికొకరు ఆలోచించుకున్నారు. గొప్ప విషయమేగా భాయ్ అని బన్సీ అంటాడు.

మనీషా టీ తీసుకొస్తుంది. తననే ఇవ్వమంటే మనీషా సిగ్గుపడుతుంది. బన్సీ ఇస్తాడు. మీరు రెండో పెళ్లి సంబంధం చేసుకోవడం మాకెవరికి ఇష్టంలేదని బన్సీ అంటాడు. ఇది కూడా తప్పిపోయింది. నాకు సంబంధాలు వస్తాయా అని మాధవ అంటాడు. మనీషాను చూసిన బన్సీ.. తడబడుతూనే మా మనీషాను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు.

దాంతో మనీషా తెగ సంతోషిస్తుంది. మాధవ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని మాధవ అంటాడు. ఇన్ని సంబంధాలు చూశారు. కానీ మా మనీషా కళ్లలో మీపై ఉన్న ప్రేమను చూడలేదు. మన...