భారతదేశం, అక్టోబర్ 30 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కన్నా ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. నాకోసం ఎందుకు రాలేదని అలుగుతాడు. చక్రిని అన్నయ్య అని పిలవను అని కన్నా అంటాడు. దాంతో చక్రి బాగా ఫీల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఊరికే అన్నాను అని కన్నా అంటాడు. అన్నది మర్చిపోయావా. అన్నయ్యలను మర్చిపోయి వెళ్లావ్ అందుకే వాడిని అంతలా ఏడిపిస్తున్నావని కేశవ అంటాడు.

ఇదేంటీ రివర్స్‌లో నన్ను అంటున్నారు. నేను అంటే మీరు అన్నయ్యలు కాకుండా పోతామా. ఎంతైనా మనది రక్తసంబంధం అని కన్నా అంటాడు. ఇంతలో మహాలక్ష్మి వస్తే తన చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంటాడు చక్రి. నువ్వు నన్ను వదిన అని పిలుస్తున్నావ్. ఆ అధికారంతో కొట్టాను తప్పా. ఎంత కోపం ఉన్నా కన్నతండ్రికి గౌరవం ఇవ్వాలి. ఆయన వయసుకు మర్యాద ఇవ్వాలి అని మహా అంటుంది.

నువ్వు నన్ను కొట్ట...