భారతదేశం, అక్టోబర్ 29 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కన్నా నారాయణ కొడుకు కాదని, అసలు జమున భాయ్ అతని భార్యే కాదని అన్ని నిజాలు చక్రి, కేశవలకు చెబుతుంది మహాలక్ష్మి. తల్లి వదిలేసి వెళ్లిపోతే అనాథాశ్రమంలో కన్నాను వదిలేయకుండా తండ్రిలా చూసుకున్నాడు. అందుకే నా దృష్టిలో నారాయణ నారాయణుడయ్యాడు అని మహా అంటుంది.

అయ్యో కన్నా మా తమ్ముడు కాదా. దీనికోసమా మహాలక్ష్మిని నిలదీశాం. ఇది తెలుసుకునేందుకా అని చక్రి బాధపడతాడు. రేయ్ వాడు నాన్నకు కొడుకు ఎలా అయ్యాడో అనవసరం. మనకు సొంత తమ్ముడి కంటే ఎక్కువరా. ఈ చేతులతో పెంచాను. వాడు నాకు దత్తపుత్రుడురా. కన్నా మన సొంత తమ్ముడు అనుకోవాల్సిందే అని మాధవ అంటాడు.

అనుకోవడం ఏంటీ వాడు మన తమ్ముడే. రక్తసంబంధం కాకపోయిన పాతికేళ్ల అనుబంధం మనది అని కేశవ అంటాడు. వాడి తల్లి ఎలాంటిదో మనకు అనవసరం. ఇ...