భారతదేశం, ఆగస్టు 16 -- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకెళుతున్న ప్రముఖ బ్రాండ్ పోకో.. భారతీయ వినియోగదారులకు మరో అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో శక్తివంతమైన ఫీచర్లతో 'పోకో ఎం8 పవర్' ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆ కంపెనీ.. ఇప్పుడు అదే ఎం-సిరీస్ నుంచి మరో కొత్త హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. 'పోకో ఎం8ఎక్స్ 5జీ' స్మార్ట్​ఫోన్ త్వరలోనే భారత్‌లో విడుదల కానుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

ఈ పోకో కొత్త స్మార్ట్​ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయించనున్నట్లు స్పష్టమైంది. విడుదలకు సంబంధించి ఇప్పటికే దేశంలో ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఈ ఫోన్ డిజైన్, ఇతర లభ్యతకు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి.

టీజర్ల ప్రకారం.. పోకో ఎం8ఎక్స్ 5జీ ఫోన్ ఆకర్షణీయమైన ఫ్లాట్ రియ...