భారతదేశం, మార్చి 20 -- ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఇంధన సరఫర వ్యవస్థలకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ప్రభావితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా ప్రీమియం(పవర్) పెట్రోల్ ధరలు పెరిగాయి. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 2 నుంచి రూ. 2.30 వరకు పెంచాయి.కొత్త ధరలు మార్చి 20, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. బీపీసీఎల్ స్పీడ్, హెచ్పీసీఎల్ పవర్, ఐఓసీఎల్ ఎక్స్పీ95 ధరలు లీటరుకు రూ.2.09 నుంచి. రూ.2.35కు చేరాయి. అయితే ప్రస్తుతం రెగ్యూలర్ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని ఆయా చమురు సంస్థలు స్పష్టం చేశాయి.
ముడి చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని HPCL(హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) స్పష్టం చేసింది. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.