భారతదేశం, మే 25 -- దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్​పై రూ. 2.61, లీటరు డీజిల్​పై ఈసారి రూ. 2.71 పెంచాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం, స్ట్రెయిట్ ఆఫ్​ హర్ముజ్​ వద్ద అనిశ్చితి కారణంగా మన దేశంలో ఇంధన ధరలు పెరగడం 10 రోజుల్లో ఇది 4వసారి.

తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​ ధర తొలిసారి రూ. 100 దాటింది. ఇక ఇంధన ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లు నిలుస్తున్నాయి.

దిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్​ ధర రూ. 99.51 నుంచి రూ. 102.12కి చేరింది. ఇక లీటరు డీజిల్​ ధర రూ. 92.49 నుంచి రూ. 95.20కి పెరిగింది.

కోల్​కతాలో పెట్రోల్​, డీజిల్​ ధరలు వరుసగా రూ. 113.51, రూ.99.82గాను, చెన్నైలో రూ. 111.21, రూ. 99.82గాను ఉన్నాయి.

ఇక చెన్నైలో లీటరు పెట్రోల్​ ధర రూ. 1...