భారతదేశం, ఏప్రిల్ 29 -- Petrol price in Hyderabad : నేటితో పశ్చిమ్ బెంగాల్​ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెంపు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్​టాపిక్​గా మారింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, ఎన్నికల కోడ్ ముగియగానే సామాన్యుడిపై భారం పడుతుందనే వార్తలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. పెట్రోల్​, డీజిల్​ ధరలు ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోంది?

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత రెండు నెలల్లో ఏకంగా 50 శాతం పెరిగాయి! పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదో వంతు వాటా కలిగిన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' మార్గంలో అడ్డంకులు ఏర్పడటంతో ధరలు భగ్గుమన్నాయి.

గత ఏడాది బ్రెంట్​ క్రూడ్ బ్యారెల్ ...