Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
భారతదేశం, జూలై 31 -- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) మృతి చెందారు. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం), గుండెపోటు సంబంధిత సమస్యలతో హైదరాబాద్ సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం తెల్లవారుజామున 12:51 గంటలకు కన్నుమూశారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
జూలై 26న హనుమకొండలోని స్వగృహంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, పల్మనరీ ఎంబోలిజం వ్యాధితో బాధపడుతున్న ఆయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.