భారతదేశం, జూన్ 7 -- Peddi Movie Controversy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' (Peddi) చిత్రం బాక్సాఫీస్ వసూళ్లతో పాటు సరికొత్త వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానం, కెమెరా యాంగిల్స్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే నెగిటివ్ ట్రెండ్ నడుస్తోంది.

ఇప్పటికే పెద్దిలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన తీరుపై డైరెక్టర్ బుచ్చిబాబు సాన సారీ చెప్పాడు. ఆ సీన్లను తొలగించారు కూడా. అయితే, ఈ గ్యాప్‌లోనే ఇండస్ట్రీని షేక్ చేస్తూ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరిట కొన్ని ప్రైవేట్ చాట్స్ స్క్రీన్ రికార్డింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఒక పాపులర్ ఫ్యాన్ క్లబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ అన్‌వెరిఫైడ్ (నిర్ధారణ కాని) స్క్రీన్ రికార్డింగ్స్ ప్రకారం.. 'అచ్...