భారతదేశం, జూన్ 8 -- Peddi 4 Days Worldwide Box Office Collection: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. 'ఉప్పెన' చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన సరికొత్త చిత్రం 'పెద్ది'.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ వివాదం ఇలా నడుస్తుండగానే, థియేటర్లలో మాత్రం 'పెద్ది' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే పెద్ది సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

బాక్సాఫీస్ ట్రాకర్ 'సాక్‌నిల్క్' నివేదిక ప్రకారం.. 'పెద్ది' చిత్రం న...