భారతదేశం, జూన్ 5 -- Peddi Box Office Collections Day 1: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఏంటో 'పెద్ది' సినిమా నిరూపించింది. సూపర్ హిట్ 'ఆర్ఆర్ఆర్', ఫ్లాప్ మూవీ 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన పక్కా మాస్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య గురువారం (జూన్ 4) విడుదలైన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో విధ్వంసం మొదలుపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే కనిపిస్తున్న ఈ ట్రెండ్, తొలిరోజు కలెక్షన్స్‌లో స్పష్టంగా కనిపించింది. రామ్ చరణ్ మాస్ పవర్ ముందు బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి.

దేశవ్యాప్తంగా సుమారు 3000 స్క్రీన్లలో విడుదలైన 'పెద్ది', అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 20 కోట్ల గ్రాస్ వసూలు చేసి, దాదాపు 8.2 లక్షల టిక్కెట్లు తెగడం సినిమాపై ఉన...