భారతదేశం, జూన్ 12 -- Peddi 8 Days Worldwide Box Office Collection: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఎంట్రీ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేటర్లలో కలెక్షన్ల సంచలనం సృష్టిస్తోంది.

భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదలైన పెద్ది చిత్రం మొదటి వారం రోజులు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. అయితే, వీకెండ్‌లో కనిపించిన అసాధారణమైన జోరుతో పోలిస్తే వర్కింగ్ డేస్‌లో కలెక్షన్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచి 'పెద్ది' సరికొత్త రికార్డు సృష్టించింది.

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ (Sacnilk) సమాచారం ప్రకారం.. 'పెద్ది' చిత్రానికి జూన్ 11 గురువారం (ఎనిమిదో రోజు) దే...