Pawan Kalyan health update : పవన్‌కు సర్జరీ.. ముంబయి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు
భారతదేశం, జూలై 12 -- ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రెండు భుజాల రోటేటర్ కఫ్ తీవ్రంగా దెబ్బతినడంతో, వైద్యులు ఆయన కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలోని ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి చేరుకుని, పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని జనసేన పార్టీ అధికారికంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.