భారతదేశం, ఏప్రిల్ 18 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శనివారం సాయంత్రం వైద్యులు ఆయనకు ఈ ఆపరేషన్ నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ తన కార్యాలయ అధికారులతో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకున్నారు. పరిస్థితిని గమనించిన వైద్యులు. ఆ రోజు జరగాల్సిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆసుపత్రికి రావాలని సూచించారు.

ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్‌కు వైద్యులు వివిధ రకాల పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ. (MRI) స్కాన్ కూడా నిర్వహించారు. పరీక్షా ఫలితాలను విశ్లేషించిన నిపుణులు, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయ...