భారతదేశం, ఆగస్టు 26 -- Pavan Sadineni Arrest Actress Complaint: తెలుగు చిత్రసీమలో ఓ యంగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అతనే డైరెక్టర్ పవన్ సాధినేని. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న పవన్ సాధినేని వివాదాస్పద రీతిలో పోలీసులకు చిక్కారు. వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తనను మోసం చేశాడంటూ ఓ నటి పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, పవన్ సాధినేనిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా లైంగిక వేధింపుల కేసు కూడా పవన్ సాధినేనిపై నమోదు అయినట్లు సమాచారం. విభిన్నమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రతిభావంతమైన దర్శకుడు ఈ విధంగా అరెస్ట్ కావడం ఫిలింనగర్ వర్గాలను తీవ్ర...