భారతదేశం, ఏప్రిల్ 21 -- Paresh Rawal Says Comedy Films Tough Competition Show: బాలీవుడ్ నటుడు, కమెడియన్ పరేష్ రావల్ తెలుగులో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించారు. చిరంజీవి-పరేష్ రావల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎంతగా పేలాయో అందరికీ తెలిసిందే.

ఈ సినిమానే కాకుండా చిరంజీవితో బావగారు బాగున్నారా మూవీలో కూడా పరేష్ రావల్ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే పరేష్ రావల్ నటించిన హిందీ కామెడీ హారర్ మూవీ భూత్ బంగ్లా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. డైరెక్టర్ ప్రియదర్శన్-బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటి ఈ హారర్ కామెడీ సినిమా సత్తా చాటుతోంది. ఇందులో కూడా ...