భారతదేశం, జూలై 22 -- Paper Leaks: దేశవ్యాప్తంగా నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం మంటలు రేపుతున్న వేళ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) అత్యంత వివాదాస్పదమైన, సంచలనాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చింది. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల లీకేజ్, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంతో తెరకెక్కుతున్న 'ది స్కామ్ - లీక్డ్' (The Scam - Leaked) వెబ్ సిరీస్ టీజర్‌ను బుధవారం (జులై 22) జీ5 అఫీషియల్‌గా రిలీజ్ చేసి దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసింది.

కేవలం 1 నిమిషం 9 సెకన్ల నిడివితో వచ్చిన ఈ వెబ్ సిరీస్ టీజర్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. "ఒకే ఒక్క పేపర్.. లక్షలాది కలలు.. ఒకే ఒక్క లీక్.. దేశం మొత్తం ఆశ్చర్యంలో!" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో జీ5 ఈ వీడియోను పోస్ట్ చేసింది.

హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో కట్టుదిట్టమైన నిఘా మధ్య మెడికల్ క్వశ్చన్ పేపర్లు...