భారతదేశం, ఏప్రిల్ 6 -- ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యదర్శులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. పంచాయతీ కార్యదర్శుల జీతం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చ అవుతోంది.

గతంలో గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 3 హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ.. జారీ చేసిన జీవో 91 ప్రకారం వీరికి రూ.28,290 పేస్కేల్ నిర్ణయించారు. అయితే కూటమి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరిస్తూ.. జీవో 60ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.28,280 నుంచి రూ.25,220కి తగ్గించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O.MS.No. 60 ఉత్తర్వుల ప్రకారం, గ్రామ పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్ల పునర్విభజన, వేతన సవరణలో భాగంగా గ్రేడ్-III కార్యదర్శుల వేతన శ్రేణిని స...