భారతదేశం, మే 18 -- Panchayat Season 5 OTT Release Details: ఓటీటీ వెబ్ సిరీస్ ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించిన 'పంచాయత్' అభిమానులకు డిజిటల్ వేదికపై అదిరిపోయే వార్త వచ్చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని 'ఫులేరా' అనే ఓ చిన్న పల్లెటూరు నేపథ్యంతో సాగే ఈ పొలిటికల్ సెటైరికల్ కామెడీ డ్రామా సిరీస్ ఐదో సీజన్‌కు సిద్ధమైంది.

ఆద్యంతం హాస్యం, గ్రామీణ రాజకీయాలు, భావోద్వేగాల కలయికగా సాగే ఈ ఓటీటీ సిరీస్ కొత్త చాప్టర్ ఈ ఏడాదిలోనే డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ సిరీస్ హిందీలో రూపొందినప్పటికీ, మన తెలుగు ప్రేక్షకులలోనూ దీనికి విపరీతమైన ఆదరణ ఉంది. డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగు ఇళ్లలో కూడా 'సచివ్ జీ', 'ప్రహ్లాద్ చాచా' పాత్రలు బాగా సుపరిచితమయ్యాయి.

పంచాయత్ సీజన్ 4 ముగింపులో ఫులేరా గ్రామంలో పెద్ద రాజకీయ మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఐదో సీజన్‌...