భారతదేశం, మే 16 -- Osmania University PhD Notification 2026 : స్మానియా విశ్వవిద్యాలయం (OU) లో పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి కీలక అప్డేట్ వచ్చేసింది. యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ (Ph.D.) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ కేటగిరీ-1 కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. యుజీసీ (UGC), సీఎస్ఐఆర్ (CSIR), ఐసీఎంఆర్ (ICMR), ఐసీఏఆర్ (ICAR), డీబీటీ (DBT), ఇన్‌స్పైర్ (INSPIRE), ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ (NFSC) మరియు ఎన్‌ఎఫ్‌ఎస్‌టీ (NFST) వంటి జాతీయ స్థాయి పరీక్షల ద్వారా జేఆర్‌ఎఫ్ సాధించిన అభ్యర్థులు ఆన్‌...