భారతదేశం, అక్టోబర్ 19 -- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ (PhD) అభ్యసించాలనుకుంటున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఓయూ పరిధిలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

మొత్తం 53 సబ్జెక్టులకు గాను ఈ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈసారి ప్రవేశ పరీక్షలను పూర్తిస్థాయిలో కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలోనే నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజూ మూడు వేర్వేరు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబర్ 10వ తేదీ నుం...