భారతదేశం, సెప్టెంబర్ 26 -- Osmania University PhD admissions 2026 : ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్‌డి (Ph.D.) చేయాలనుకునే వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే కేటరిగి 2 కింద ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రాగా. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 'పీహెచ్‌డి ఎంట్రన్స్ టెస్ట్-2026' ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

అర్హులైన అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 5, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. పరిశోధన రంగంలోకి అడుగుపెట్టాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించే ముందు అభ్యర్థులు తమ అర్హత నిబంధనలను, తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించిన సబ్జెక్టుల అందుబాటును జాగ్రత్తగా సరిచూసుకోవాలని డైరెక్టరే...