భారతదేశం, అక్టోబర్ 6 -- ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ (కేటగిరీ-2) ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మరో అప్‌డేట్ వచ్చింది. పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్ - 2026 కి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల(ఆలస్య రుసుంతో) గడువును పొడిగించారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... ఎలాంటి ఆలస్య రుసుము (లేట్ ఫీజు) లేకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి 2026 అక్టోబర్ 05వ తేదీతో తుది గడువు ముగిసింది. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన అభ్యర్థులకు అధికారులు మరో అవకాశం కల్పించారు. రూ. 2,000 ఆలస్య రుసుము చెల్లించి అక్టోబర్ 15, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చని వెల్లడించారు.

వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలను 2026 నవంబరు రెండవ వారం...