భారతదేశం, అక్టోబర్ 31 -- OTT Telugu Weekend: వీకెండ్ వచ్చేసింది! థియేటర్లకు వెళ్లే మూడ్ లేదా? ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి మంచి సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వారం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు మీకోసం అదిరిపోయే తెలుగు లైనప్‌ను సిద్ధం చేశాయి. ప్రతివారం లాగే ఈసారి కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ వారం యాక్షన్ ప్రియుల కోసం రెండు క్రేజీ చిత్రాలతో మన ముందుకు వచ్చింది. అందులో మొదటిది 'సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్' (Sub-Inspector : YUGANDHAR). అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

ఇక దీనికి తోడు మరో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైన...