భారతదేశం, సెప్టెంబర్ 19 -- OTT Weekend: ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వినోదాల జాతర జోరుమీదుంది. టాలీవుడ్ నుంచి మాస్ మహారాజా రవితేజ ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, తమిళం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న 'మొద రాతిరి' డార్క్ కామెడీ అలరిస్తోంది. ఈ వీకెండ్ కు ఈ వారం విడుదలైన ఈ టాప్ 5 ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫాదర్-డాటర్ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం.. తండ్రి బాధ్యత, అయ్యప్ప దీక్ష నేపథ్యంతో సాగే సెంటిమెంట్ డ్రామాగా రూపొందింది.

మద్యం అలవాటు ఉన్న తండ్రి తన కూతురి కోసం దీక్ష చేపట్టి, గ్రామంలోని బాలిక...