భారతదేశం, ఆగస్టు 28 -- OTT Movies To Watch This Weekend Telugu: వారమంతా పనులతో అలసిపోయిన సినీ ప్రియులు వీకెండ్‌లో ఓటీటీల్లో మంచి కంటెంట్ కోసం వెతుకుతుంటారు. సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, ఊహించని మలుపులు ఉండే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో ఈ వీకెండ్‌లో తెలుగులో కట్టిపడేసే ది బెస్ట్ 7 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ఓ లుక్కేద్దాం.

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8/10

ఒక ఫ్యామిలీ నేపథ్యంలో సాగే అరుదైన మిస్టరీ డ్రామా ఇది. అసిఫ్ ఆలీ, సీనియర్ నటుడు విజయరాఘవన్ పోషించిన అప్పు, పిళ్లై పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. కథను నడిపించిన తీరు, సీన్స్ మూడ్‌ని సెట్ చేసే నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని ఆద్యంతం అలరిస్తాయి. కథనం కాస్త నెమ్మదిగా సాగడం వల్ల స్లో-బర్న్ సినిమాలు నచ్చని వారి ఓపికను పరీక్షించ...