భారతదేశం, మే 1 -- OTT Weekend Watch Movies: సినిమా ప్రియులకు ఈ వీకెండ్‌‌కి ఓటీటీలో పండగే అని చెప్పాలి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన వైవిధ్యభరితమైన సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అవి మొత్తంగా 12 ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ వారం ఆసక్తికరమైన సినిమాలు లైన్లో ఉన్నాయి. ముఖ్యంగా యువ నటుడు సతీష్ నటించిన 'ముస్తఫా ముస్తఫా' ఈ నెల 30 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక ప్రముఖ టీవీ యాంకర్ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయితే, అతని కెరీర్, పెళ్లి ఎలా ఇబ్బందుల్లో పడ్డాయనే అంశాన్ని డార్క్ కామెడీగా ఈ చిత్రంలో చూపించారు.

అదేవిధంగా, నట్టి (సుబ్రమణ్యం) ప్రధాన పాత్రలో నటించిన 'TN 2026' కూడా ఏప్రిల్ 30న ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒక స్టార...