భారతదేశం, ఆగస్టు 6 -- OTT Views: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ మేకా (Srikanth Meka) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త లీగల్ డ్రామా వెబ్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord). ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సంచలన వ్యూయర్‌షిప్ రికార్డులతో దూసుకుపోతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ విడుదలైన కొద్ది రోజుల్లోనే డిజిటల్ రికార్డులను తిరగరాసింది.

దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ (Santosh Ayyappan) తెరకెక్కించిన ఈ ఏడు ఎపిసోడ్ల లీగల్ డ్రామా అబ్జెక్షన్ మై లార్డ్ జులై 31, 2026న ఓటీటీలోకి వచ్చింది. జీ5 ప్లాట్‌ఫామ్‌లోనే అత్యంత వేగంగా 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ (50 Million+ Streaming Minutes) డిజిటల్ వ్యూయర్‌షిప్ సాధించిన తెలుగు వెబ్ సిరీస్‌గా 'అబ్జెక్షన్ మై లార్డ్' చరిత్ర సృష్టించింది. కోర్ట...