భారతదేశం, మార్చి 28 -- కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు, ఓటీటీ రిజల్ట్స్ రెండు వేరు వేరుగా ఉంటాయి. థియేటర్లలో బాగా ఆడిన సినిమాలు ఓటీటీలో మోస్తరు స్థాయిలో పర్ఫామెన్స్ చేస్తే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీస్ మాత్రం ట్రెండింగ్‌లో దూసుకుపోతుంటాయి. ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు కూడా అదే జరగింది.

థియేటర్లలో విడుదలైన తెలుగు రొమాంటిక్ మూవీకి థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వస్తే ఓటీటీ స్ట్రీమింగ్ అనంతరం టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఆ సినిమా మరేదో కాదు విష్ణు విన్యాసం. టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమానే విష్ణు విన్యాసం.

ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా నయన్ సారిక హీరోయిన్‌గా చేసింది. యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించారు. సుమంత్ నాయుడు జీ నిర్మాతగా వవ్యవహరించారు. విష్ణు విన్యాసం సినిమాలో హ...