భారతదేశం, మార్చి 4 -- ఓటీటీల వాడకం ఎక్కువయ్యాక మలయాళం సినిమాలు, సిరీస్ లపై తెలుగు ఆడియన్స్ ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను ఎక్కువగా చూసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి మలయాళం సిరీస్ 'రోస్లిన్' ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు జనాలు ఈ సిరీస్ ను తెగ చూసేస్తున్నారు.

మలయాాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రోస్లిన్' ఓటీటీలో సత్తాచాటుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 27న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఉత్కంఠతో సాగుతోంది. ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ రోస్లిన్ సిరీస్ లో మీనా, వినీత్, సంజన దీపు, హకీం షాజహాన్ తదితరులు నటించారు.

రోస్లిన్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఓటీటీలో రిలీజై...