భారతదేశం, మే 31 -- Telugu Romantic Drama Drinker Sai OTT Trending: హీరోగా ధర్మ మహేష్ నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం డ్రింకర్ సాయి. "బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్" అనేది ట్యాగ్‌లైన్. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ఈ సినిమాను నిర్మించారు.

డ్రింకర్ సాయి మూవీకి తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధర్మ మహేష్‌కు జోడీగా హీరోయిన్ ఐశ్వర్య శర్మ నటించింది. 2024 డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 8.7 రేటింగ్‌ను దక్కించుకుంది.

ఇప్పుడు డ్రింకర్ సాయి ఓటీటీలోనూ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ధర్మ మహేష్ కనబరిచిన అద...